జలమండలికి టీఎస్ఐపాస్ అవార్డు…

513
ktr
- Advertisement -

రెవెన్యూ పెంచేందుకు వీడీఎస్, ఇంటింటి సర్వే, వాక్ వంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు. ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో వీడీఎస్, రెవెన్యూ, ఇంటింటి సర్వే, సనత్ నగర్ పైలెట్ ప్రాజెక్టు, వాక్, జీఐఎస్ వంటి అంశాలపై దానకిషోర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇంటింటి సర్వే తో జలమండలి రెవెన్యూ పెరిగినట్లు ఎండీ చెప్పారు. నల్లా కనెక్షన్ వినియోగదారులు 100 శాతం బిల్లులు జార చేసి… 100 శాతం కలెక్షన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటితో పాటు 50 వేలకు పైగా బకాయి ఉన్న కనెక్షన్ల నుంచి బిల్లులు వసూలు చేయడంపై క్షేత్రస్థాయి అధికారులు దృష్టిసారించాలని సూచించారు. వారు బిల్లులు చెల్లించకపోతే రెడ్ నోటీసులు జారీ చేసి కనెక్షన్ తొలగించాలని ఆదేశించారు.

jalamandali

వీటితో పాటు అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్దీకరించుకోవడానికి ప్రవేశపెట్టిన వీడీఎస్ కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించాలని సూచించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి వీడీఎస్ దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాటు చేయాలని మేనేజర్లను ఆదేశించారు.

ఈ సందర్భంగా వీడీఎస్ పై రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను ఎండీ ఆవిష్కరించారు. మరోవైపు టీఎస్ ఐపాస్ ప్రధానం చేసిన అవార్డుల్లో జలమండలికి మూడో కేటగిరీలో ప్రధమ అవార్డు లభించింది. ఓఆర్ఆర్ పరిధిలో జలమండలి 87 పరిశ్రమలకు త్వరగా అనుమతులు ఇచ్చినందుకు గాను ఈ అవార్డు మంత్రి కేటీఆర్ అందించారు.

Hyderabad jalamandali recieves TSIPass award for excellence. Hyderabad jalamandali recieves TSIPass award for excellence.

- Advertisement -