రేపటి నుండే స్కూల్స్ ఓపెన్..హైకోర్టు గ్రీన్ సిగ్నల్

236
schools
- Advertisement -

రేపటి నుండి స్కూల్స్ ఓపెన్ చేయడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు లో విచారణ జరుగగా …రేపటి నుంచి ప్రత్యక్ష క్లాసులకు హై కోర్టు ఓకే చెప్పింది. పేరెంట్స్ పై స్కూల్స్ యాజమాన్యాలు ఒత్తిడి చేయొద్దని..తల్లి తండ్రుల నుంచి ఎలాంటి అండర్ టేకింగ్ వద్దని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రెసిడెన్షియల్ హాస్టల్స్ తెరవద్దని సూచించింది.

అన్ని వైద్య సదుపాయాలు ఉన్న అమెరికాలో రోజుకి లక్ష కేసులు పెరుగుతున్న పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. భారత దేశంలో వైద్య సదుపాయాలు లేవని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లో కూడా అదే పరిస్థితి ఉందని తెలిపారు. చిన్నపిల్లలను పాఠశాలకు పంపే ముందు తల్లిదండ్రులు అండర్ టేకింగ్ ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే UNICEF పాఠశాల తప్పనిసరిగా ఓపెన్ చేయాలి అని చెప్పిందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. చాలామందికి స్కూల్లో న్యూట్రిషన్ ఫుడ్ మిస్ అవుతున్నారని ..స్కూల్లో ఆహార సరఫరా పై డీఈఓ నేతృత్వంలో పర్యవేక్షణలో చేస్తామని వెల్లడించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం రేపటి నుండి స్కూల్స్‌ ఓపెన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30 లోగా శానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే స్కూల్స్ ప్రారంభానికి అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

- Advertisement -