ఏపీ నుండి తెలంగాణ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏపీ సీఎంకు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేశారు. ఈమేరకు ట్రాన్స్ కో,జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ను కలిసి ఏపీ ప్రభుత్వం నుండి రావల్సిన డబ్బులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఖైరతాబాద్‌లో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసీ సమావేశం జరిగింది.
అనంతరం చీఫ్ అడ్వయిజర్ ఏయిస్ అసోసియేషన్ వినోద్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. ఏపీ విద్యుత్ శాఖలో తెలంగాణకు సంబంధించిన నగదు కూడా ఉంది. తెలంగాణ ఉద్యోగుల డబ్బును తెలంగాణకు ట్రాన్స్ ఫర్ చేయాలి అన్నారు. మాకు రావల్సిన బకాయిలు వెంటనే మాకు ట్రాన్స్‌ఫర్ చేయాలి. లేదంటే ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ ఉన్న ఏపీ ఉద్యోగులకు మాకు ఇప్పుడిప్పుడే సంబంధాలు బలపడుతున్నాయి ఈ తరుణంలో మళ్ళీ బకాయిలు ఇవ్వమని లేఖ రాయడం కరెక్ట్ కాదు అన్నారు.
అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ.. ఏపీ విద్యుత్ సంస్థల్లో 2014 కంటే ముందు ఉద్యోగుల జిపిఎఫ్, ఏపీఎఫ్ అక్కడే ఉంది. విద్యుత్ ఉద్యోగులకు చెందాల్సిన డబ్బులు ఏపీ ప్రభుత్వంకు ఇస్తామంటే ఒప్పుకోము. విద్యుత్ ఉద్యోగుల ట్రస్ట్ డబ్బులు మాకే కేటాయించాలి. లేదంటే ఉద్యమం చేయాల్సి వస్తుందన్నారు.
టీజాక్ నేత షరీఫ్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల కష్టార్జితం కానీ ఇవ్వమని లేఖ రాయడం కరెక్ట్ కాదు. మాస్టార్ ట్రస్ట్ లో ఉన్న 2720 కోట్ల సొమ్ము ఒక కార్పొరేషన్ పేరిట స్వాహా చేయాలని చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇది మంచిది కాదు..మా డబ్బులు మాకు పంపాలి అన్నారు.
విద్యుత్ ఇంజినీర్స్ ఉద్యోగుల జెఎసి ప్రెసిడెంట్ శివాజీ మాట్లాడుతూ.. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఉమ్మడి ఏపీలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక ట్రస్టు ఏర్పాటు చేసాం. 4 ట్రస్టులు ఉన్నాయి. ఉద్యోగుల డబ్బులు, వాళ్ళ జీతం నుంచి వచ్చిన డబ్బులతో ట్రస్టులో దాచుకున్నారు. 2900 కోట్ల రూపాయలు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల డబ్బులు. ఆ డబ్బులు రానివ్వకుండా ఏపీ యాజమాన్యాలు మొండిగా వ్యవహరించాయనా ధ్వజమెత్తారు.
28 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. 14 వేల మందికి తెలంగాణ డబ్బులు చెల్లిస్తోంది. విద్యుత్ సంస్థల సమస్యలు యాజమాన్యాలు చూసుకుంటాయి. తెలంగాణ ఉద్యోగుల డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడి ఏపీ పెన్షనర్లకు ఇబ్బందులు తప్పవు. రానున్న రోజుల్లో మరో ఉద్యమంకు దారితీస్తుంది. ఇవాళ మా సీఎండీని కూడా కలిసాం సానుకూలంగా స్పందించారు. సంస్థ తరుపున కూడా పోరాటం చేస్తాం అన్నారు అని తెలిపారు.