ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వేలో తెలంగాణ పోలీసు శాఖ సత్తా చాటింది. స్మార్ట్ పోలీసింగ్‌లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇక మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఐదు విభాగాల్లో మొదటి స్థానం, మరో ఐదు విభాగాల్లో రెండో స్థానం, మరో విభాగంలో మూడో స్థానంలో తెలంగాణ పోలీసులు నిలిచింది. పోలిస్ సెన్సిటివిటి, పోలీసుల నిబద్ధత-మంచి ప్రవర్తన, పోలీసుల స్పందన, టెక్నాలజీ ఉపయోగం, అందుబాటులో పోలీసు వ్యవస్థ విభాగాల్లో తెలంగాణకు మొదటి స్థానం వచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్, నిష్పక్షపాత, చట్టబద్ధ- పారదర్శక పోలిసింగ్, ప్రజల నమ్మకం, జవాబుదారీతనం విభాగాల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. చిత్తశుద్ధి, అవినీతి రహిత విభాగంలో మూడో స్థానంలో తెలంగాణ పోలీసు శాఖ నిలిచింది.
స్మార్ట్ పోలీసింగ్‌పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. 2014 డిజిపిల సమ్మేళనంలో స్మార్ట్ పోలిసింగ్ పద్దతులను పాటించాలని ప్రధానమంంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు స్పందించి రాష్ట్రాలలో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ స్మార్ట్ పోలిసింగ్ సర్వే నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వే నిర్వహించింది ఐపిఎఫ్.