నోట్ల రద్దు పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి కేటీఆర్ అన్నారు.ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో అధికారులు టీహబ్ పేరుతో తెలంగాణ పెవీలియన్‌ను ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్‌తోపాటు ఎంపీల బృందం తెలంగాణ పెవీలియన్‌ను సందర్శించారు. తెలంగాణ పెవీలియన్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్, టీహబ్ ఫేజ్ 2 నమూనా, టీఎస్‌ఐఐసీ, తెలంగాణ టూరిజం స్టాళ్లను మంత్రి కేటీఆర్, ఎంపీలు సందర్శించారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయని…ఏరోస్పేస్,ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రాలకు కేంద్ర సాయం చేయాలని సూచించారు. పెంబర్తి,నిర్మల్ కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కేటీఆర్ అన్నారు. టీఎస్ ఐపాస్‌ను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. తెలంగాణ పెవీలియన్ అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు.