తెలంగాణ పంచాయతీ ఎన్నికలు మొదటిదశలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల పోరు నువ్వానేనా అన్నట్లు సాగుతుందని భావించినా భారీ మెజార్టీతో గెలిస్తే మరికొంతమంది తమ ఓటు తామే వేసుకోవడం మర్చిపోయి ఓటమిపాలై దుఃఖంలో మునిగిపోయారు.
మహబూబ్‌నగర్ జిల్లా గార్ల మండలం రాజుతండాలో జరిగిన ఈ విషాదఘటన స్ధానికుల్లో విషాదాన్ని నింపింది. బానోతు భాస్కర్(28) ఎంటెక్ చదివి కారేపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. వార్డ్ మెంబర్‌గా పోటీ చేస్తూ ఎన్నికలకు రెండ్రోజుల ముందు గుండెపోటుతో మరణించాడు.
అయితే అభ్యర్థి చనిపోయినప్పటికీ అధికారులు మాత్రం సోమవారం గ్రామంలో ఎన్నికలు యథావిధిగా నిర్వహించారు. మృత్యువు ఓడించినా గ్రామస్తులు మాత్రం చనిపోయిన భాస్కర్‌నే వార్డు మెంబర్ గెలిపించి ఔదార్యాన్ని చాటుకున్నారు. మూడో వార్డు నుంచి కాంగ్రెస్ మద్దతుగా వార్డ్ మెంబర్‌గా నామినేషన్ వేసిన భాస్కర్ 25 ఓట్ల తేడాతో గెలుపొందారు.