తెలంగాణ సాంసృతిక పునర్వైభవాన్ని చాటిచెప్పేలా కాకతీయ వైభవ సప్తాహన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం వారం రోజులపాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తున్నది.
కాకతీయుల వారసుడు 700 ఏండ్ల తర్వాత ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టాడు.ఏడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను కాకతీయుల 22వ తరం వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఆయన వరంగల్‌లోని భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌కు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ ఘనంగా స్వాగతం పలికారు.
ఉత్సవాల్లో భాగంగా కాకతీయుల విశిష్టత, గొప్పతనం తెలిపేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చారిత్రక కట్టడాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా వారంరోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించనున్నారు.