విధులు బహిష్కరించిన లాయర్లు…

225
lawers
- Advertisement -

పెద్దపల్లి జిల్లాలో న్యాయవాదులైన దంపతుల హత్యపై పోలీసులపై వస్తున్న విమర్శలపై స్పందించారు రామగుండం సీపీ సత్యనారాయణ. దాడి జ‌రిగిన క్రైమ్ ప్ర‌దేశాన్ని ప్రొటెక్ట్ చేయ‌లేదు అనేది పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. రామ‌గిరి ఎస్ఐ , ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌ను క్రైమ్ ప్ర‌దేశానికి పంపి బందోబ‌స్తు ఏర్పాటు చేశామని తర్వాత మంథ‌ని సీఐ మ‌హేంద‌ర్‌, గోదావ‌రిఖని ఏసీపీ ఉమేంద‌ర్‌ను క్రైమ్ ప్ర‌దేశం ఇంచార్జిగా ఉంచి ఆధారాలు సేకరించామన్నారు.

ఇక మరోవైపు న్యాయవాద దంపతుల హత్యలను నిరసిస్తూ మంథని బంద్ కొనసాగుతుండగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విధులను బహిష్కరించిన నిరసన తెలిపారు న్యాయవాదులు. హైకోర్టుతోపాటు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా కోర్టులు, నాంపల్లి సిటీ సివిల్‌ కోర్టు, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి కోర్టుల్లో న్యాయవాదులు నిరసనవ్యక్తంచేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

న్యాయవాదుల హత్యను సుమోటోగా పరిగణలోకి తీసుకుంటున్నామని హైకోర్టు తెలిపింది. పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల వద్ద వామన్‌ రావు దంపతులను దుండగులు హత్యచేసిన విషయం తెలిసిందే.

- Advertisement -