ఐపాస్‌తో రెండు ల‌క్ష‌ల 46 వేల మందికి ఉపాధి

205
- Advertisement -

తెలంగాణలో ప్రపంచంలోనే అత్యున్నత పారిశ్రామిక విధానం అమలులో ఉందని ఐటీ శాఖ మరియు రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. పరిశ్రమలశాఖలో 2016-17లో జరిగిన కార్యక్రమాలపై బేగంపేటలోని హరితప్లాజాలో పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు వార్షిక నివేదికను విడుదల చేశారు.పరిశ్రమలశాఖ లోగోను మంత్రి ఆవిష్కరించారు. కార్య‌క్ర‌మంలో మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. గనులు, భూగర్భ వనరులు, చేనేత, జౌళిశాఖలకు సంబంధించిన పురోగతిని ఆయన వివరించారు. వివిధ క్యాటగిరీల్లో ఉత్తమ పారిశ్రామికవేత్తలను మంత్రి కేటీఆర్ సన్మానించారు.

KTR

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… టీఎస్ ఐపాస్‌కు నేటితో రెండేళ్లు పూర్త‌యిందన్నారు. ప్ర‌పంచంలోనే అత్యున్న‌త పారిశ్రామిక విధానాల‌ను అధ్య‌య‌నం చేసిన త‌రువాత సీఎం కేసీఆర్ టీఎస్ ఐపాస్‌కు రూప‌క‌ల్ప‌న చేశారన్నారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లిపోతాయ‌ని కొంద‌రు దుష్ప్ర‌చారం చేశారని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ప్ర‌థ‌మ స్థానంలో ఉందన్న కేటీఆర్‌.. టీఎస్ ఐపాస్ విప్ల‌వాత్మ‌క‌మైన పారిశ్రామిక విధానమన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ప‌రిశ్ర‌మ‌ల‌కు 15 రోజుల్లో అనుమ‌తి ఇస్తున్నామని.. టీఎస్ ఐపాస్‌తో రెండు ల‌క్ష‌ల 46 వేల మందికి ప్ర‌త్య‌క్షంగా ఉపాధి ల‌భించిందని పేర్కోన్నారు.

- Advertisement -