ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విడదుల చేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటి స్ధానంలో నిలవగా రంగారెడ్డి రెండో స్ధానంలో నిలివగా మహబూబాద్ చివరి స్ధానంలో నిలిచింది. పలితాల్లో బాలికలు సత్తాచాటారు. ఇంటర్ ఫస్టియర్ లో 62.3 శాతం , ద్వితీయ సంవత్సరంలో 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది.
మొత్తం 4,55,789 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారు. వీరిలో 2,84,224 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 4,29,378 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. వీరిలో 2,88,772 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తుకు ఏప్రిల్ 20 వరకు గడువు విధించారు. మే 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
ఫలితాలను http://www.manabadi.co.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకొవచ్చు.