మే 24న ఐసెట్‌…

213
papi reddy
- Advertisement -

తెలంగాణ ఐసెట్-2019 షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ విడుదలవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.హైదరాబాద్‌లో ఐ సెట్ షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం మాట్లాడిన ఆయన మార్చి 7 నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణకు మే 6వ తేదీ అని తెలిపారు.

మే 9న హాల్‌టికెట్లు జారీ చేస్తామని… మే 24న ఐసెట్ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు.ఎస్సి, ఎస్టీ లకు 450 రూపాయలు,ఇతరులు 650 రూపాయలు ప్రవేశ రుసుం చెల్లించాలన్నారు. 500 రూపాయల అపరాధ రుసుము మే 6నుండి 10 వరకు స్వీకరిస్తామని 2000 రూపాయలతో మే11 నుండి 14 వరకు,5000 రూపాయలతో మే15 నుండి 17వరకు,10,000 అపరాధ రుసుము మే 18వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

19మే హాల్ టిక్కెట్ డన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపిన ఆయన మే 29న ప్రిలిమినరీ కీ జూన్‌ 1న అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. మొత్తం 14 సెంటర్లలో ఐసెట్ పరీక్ష జరుగుతుందని తెలంగాణలో 10 సెంటర్స్‌,ఏపీలో 4 సెంటర్లలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు వెల్లడించారు.

- Advertisement -