ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన ఉన్నతాధికారులు..

235
osmania
- Advertisement -

ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని సందర్శించారు ఉన్నతాధికారులు. డైరెక్టర్ జనరల్ స్టేట్ ఫైర్ సర్వీసెస్ అధికారి డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ జైన్ ( IPS), సి. లక్ష్మి ప్రసాద్ (అడిషనల్ డైరెక్టర్ ), వి .పాపయ్య( రీజినల్ ఫైర్ ఆఫీసర్), శ్రీనివాస రెడ్డి( డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ), టి .శ్రీనివాస్ (అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్) సందర్శించారు .

ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ వారికి పుష్పగుచ్ఛము అందించి స్వాగతం పలికారు . ఫైర్ సర్వీసెస్ అధికారులతో పాటు సూపరింటెండెంట్ డాక్టర్ బి .నాగేందర్ మరియు పరిపాలన యంత్రాంగం అధికారులు అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనంలో ఆఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ వెనుక భాగం లో ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి .ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయ్ , ఎప్పుడు నిర్మాణం పూర్తవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు .

osmania

ఈ సందర్బంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ గారు మాట్లాడుతూ స్టేట్ ఫైర్ సర్వీసెస్ అధికారులు ఆసుపత్రిలో నిర్మిస్తున్న ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను స్వయంగా సందర్శించి పర్యవేక్షించారని, ఈ సందర్భనుగా సూపరింటెండెంట్ గారు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ కుమార్ జైన్ IPS గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు , మరియు విచ్చేసిన ఫైర్ సర్వీసెస్ అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు .

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ .బి .నాగేందర్ గారితో పాటు డాక్టర్ .సాయి శోభా (సివిల్ సర్జన్ RMO ), డాక్టర్ .బండారి శ్రీనివాసులు (Dy సివిల్ సర్జన్ RMO ) ,సివిల్ అసిస్టెంట్ సర్జన్ RMO లు డాక్టర్ .కె .నరేంద్ర కుమార్ ,డాక్టర్ సిద్దికీ ,డాక్టర్ సుష్మ ,డాక్టర్ కవిత ,డాక్టర్ అనురాధ ,డాక్టర్ .మాధవి డాక్టర్ .జఫర్ హస్మి, సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -