డెక్కన్ ఆస్పత్రిపై ప్రభుత్వ చర్యలు..

238
deccan hospital
- Advertisement -

ప్రైవేట్ ఆస్పత్రులు లక్షల్లో కరోనా పేషంట్ల నుండి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తుండటంపై సర్వత్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలాంటి ఆస్పత్రులపై చర్యలు తప్పవని హెచ్చరింది.

ఇందులో భాగంగా కరోనా పేషంట్ల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న డెక్కన్ ఆస్పత్రిపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్ మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో ఓ రోగి డెక్కన్‌ ఆస్పత్రిలో చేరారు. పరీక్షల అనంతరం నెగిటివ్ వచ్చింది.అయితే ఆ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం దాచి.. నెగెటివ్‌ వచ్చిన వ్యక్తిని కరోనా రోగుల వార్డులో ఉంచింది. రోగికి లక్షల్లో బిల్లు వేసింది. డబ్బు చెల్లిస్తేనే డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం పట్టుబట్టింది. దీంతో చేసేదేమీ లేక బాధితుడి కుటుంబ సభ్యులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

- Advertisement -