33 జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో ఖాళీల భర్తీ…

216
phcs
- Advertisement -

పీహెచ్ సీ, సీహెచ్ సీ ల్లో వైద్యుల నియమాక కసరత్తును ప్రారంభించింది ప్రభుత్వం .227 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను ఒప్పంద పద్దతిలో నియమించనుంది.33 జిల్లాలోని పీహెచ్ సీ, సీ హెచ్ సీల్లో ఖాళీల భర్తీ కోసం నియామకం చేపట్టనుండగాఆర్నెళ్ల కాలానికి ఒప్పంద పద్ధతిన నియామకం జరగనుంది.

పీజీ చివరి సంవత్సరం వైద్యవిద్యార్ధులను సీనియర్ రెసిడెంట్స్ గా నియమించనుంది ప్రభుత్వం.ఏడాది కాలానికి ఒప్పంద పద్దతిన 1191 మంది నియామకం జరపనుండగానెలకు 70వేల రూపాయల వేతనం చెల్లించనున్నారు.

గాంధీ ఆసుపత్రి – 250, కింగ్ కోటి ఆసుపత్రి – 100, గచ్చిబౌలి టిమ్స్ – 150, ఛాతీ ఆసుపత్రి – 50, ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలకు 50 చొప్పున – 400, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులకు – 241 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆర్థికశాఖ.

- Advertisement -