ఎల్లయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం: రామలింగారెడ్డి

582
solipeta ramalingareddy
- Advertisement -

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మృతిచెందిన రైతు ఎల్లయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. గుండెపోటుతో మృతిచెందిన ఎల్లయ్య కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్నిరకాల సాయం అందిస్తామన్నారు.

దుబ్బాకలో యూరియా కొరత లేదు.. అవసరమైన మేరకు అందుబాటులో ఉందన్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే యూరియా పంపిణీ చేస్తున్నారు.

ఎల్లయ్య యూరియా తీసుకోవడానికి వచ్చి గుండె పోటుకు గురయ్యాడని చెప్పారు. ఎవరూ కూడా అనవసర రాద్దాంతం చేసి రైతులను ఆందోళన కు గురి చేయొద్దని సూచించారు.

- Advertisement -