బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం:కేటీఆర్

259
KTR brahmins
- Advertisement -

తెలంగాణలోని పేద బ్రాహ్మణులందరికి న్యాయం జరగాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమన్నారు మంత్రి కేటీఆర్.నెక్లెస్ రోడ్ వండర్ పార్క్‌లో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన కేటీఆర్ బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆయుత చండీయాగం చేసినా బ్రాహ్మణ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిన ఆ ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
యాదాద్రి,వేములవాడ,భద్రాద్రి,బాసర సరస్వతి ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.

గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి గుర్తుకొచ్చేదని కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక స్వరాష్ట్రంలో పుష్కరాలను ఘనంగా నిర్వహించిందన్నారు. పుష్కరాలకు వచ్చిన లక్షలాది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

బ్రాహ్మణుల స్థితిగతుల గురించి సీఎం కేసీఆర్‌కు తెలిసినంతగా మరెవరికి తెలియదన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఆలయాలకు మహర్ధశ పట్టిందన్నారు.దేశంలోనే అర్చకులకు ట్రెజరీ నుంచి జీతాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు కేటీఆర్. తెలంగాణలో 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌కు బ్రాహ్మణులంతా అండగా
ఉండాలన్నారు.

కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అన్నారు. తెలంగాణను ముంచేందుకు చంద్రబాబు మరోసారి కుట్రలు చేస్తున్నారని తెలిపారు. వరంగల్‌లో చనిపోయిన పూజారి సత్యనారాయణ శర్మ కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -