డీట్‌తో ఉద్యోగ అవకాశాలు: మంత్రి మల్లారెడ్డి

854
deet
- Advertisement -

డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ తెలంగాణ(DEET)తో ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు మంత్రి మల్లారెడ్డి. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి ఇప్పటివరకు దాదాపు 45 వేల ఉద్యోగాలు కల్పించామని….దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చామన్నారు.

ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల ఖాళీలు గుర్తించవచ్చు…రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ లో ముందు వరుసలో ఉందన్నారు. ఇది నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది…దీని ద్వారా ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయో కనుకోవచ్చన్నారు. అంతేకాదు యాప్ ద్వారా ఉద్యోగం పొందవచ్చు..ఈ యాప్ ద్వారా ఉచితంగా అప్లై చేసుకోవచ్చన్నారు.గూగుల్ ప్లే స్టార్ లో ఈ యాప్ అందుబాటులో ఉందన్నారు.

రాష్ట్రానికి చాలా పెద్ద కంపెనీలు వస్తున్నాయని త్వరలో వన్ ప్లస్ సంస్థ ద్వారా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు జయేశ్ రంజన్ అన్నారు. ఇది శుభ పరిణామం డీట్(deet) ద్వారా ఉద్యోగ కల్పన ఉంటుందన్నారు.

ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో ,ఏ కంపెనీలో ఉన్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వస్తున్నారని చెప్పిన జయేశ్ రంజన్‌…ఇజ్రాయెల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు.

- Advertisement -