TSGENCO తన వ్యాపార వ్యూహం మరియు విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా, అన్ని ప్లాంట్లు మరియు కార్పొరేట్ కార్యాలయాలలో ప్రస్తుతమున్న అంతర్గత సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ బదులు గా , కేంద్రీకృత ERP పరిష్కారాలను అమలు చేయాలని నిర్ణయించింది. సంస్థలో సమాచార నిర్వహణ యొక్క కొత్త శకానికి దారి చూపడానికి TSGENCO లోని ERP ప్రాజెక్టు ను “TSSHAKTHI” (TSGENCO System to Harness Aple Knowledge Transformation for Harmony and Integration) గా నామకరణం చేశారు. దీని ప్రకారం, కార్పొరేట్ కార్యాలయంతో సహా అన్ని ఉత్పాదక స్టేషన్లలో SAP ERP పరిష్కారాన్ని అమలు చేయడానికి TSGENCO మరియు M / s SAP India Pvt.Ltd భాగస్వామ్యం లో పనిచేసాయి. ఈ విధంగా TSGENCO పవర్ స్టేషన్లు మరియు ప్రధాన కార్యాలయం 01.08.2013 నుండి SAP ERP వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. అతి తక్కువ సమయంలో (10 నెలలు) , పూర్తి స్థాయిలో (18 మోడ్యూల్లు) అమలు చేసినది గా ఈ ప్రాజెక్ట్ ప్రశంసించబడింది. TSGENCO వ్యాపార ప్రక్రియలను ప్రభావితం చేయడానికి మరియు కాగిత రహిత సంస్థ వైపు అడుగులు వేయడానికి, TSGENCO SAP తో భాగస్వామ్యం చేసింది.
SAP FLM (ఫైల్ లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్) మరియు మొబైల్ టెక్నాలజీ, డాష్‌బోర్డులను ఉపయోగించి నూతన పద్ధతిలో ఆఫీసు పనులను తక్కువ సమయంలో చేయడం మరియు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని ప్లాంట్లు మరియు కార్పొరేట్ కార్యాలయాలలో SAP FLM (ఈ-ఆఫీస్) మరియు విశ్లేషణలు (డాష్‌బోర్డ్) ఉపయోగించడం వలన, TSGENCO వ్యాపార ప్రక్రియను పెంచడం ద్వారా తెలంగాణా జెన్ కో ను CSI అవార్డు వరించింది.
గెలిచిన అవార్డు:
స్టేట్ కేటగిరీ కింద సిఎస్ఐ SIG ఇ-గవర్నెన్స్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్.
ఇ-ఆఫీస్ పరిష్కారాన్ని తెలంగాణ జెన్కో చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ డి.ప్రభాకర్ రావు ప్రారంభించారు మరియు కార్పొరేట్ కార్యాలయంలో 22.02.2018 న పైలట్ గో-లైవ్ జరిగింది. మిగిలిన జనరేటింగ్ స్టేషన్లలో ఈ-ఆఫీస్ సొల్యూషన్ యొక్క రోల్ అవుట్ 19.09.2018 నాటికి మూడు దశల్లో పూర్తయింది మరియు తెలంగాణ జెన్కో యొక్క అన్ని ప్రదేశాలు ఇప్పుడు ఈ-ఆఫీస్ ఉపయోగిస్తున్నాయి. ఇంకా, ERP వ్యవస్థలో ఉత్పత్తి చేయబడుతున్న భారీ లావాదేవీల డేటాను ఉపయోగించుకోవటానికి, TSGENCO SAP తో భాగస్వామ్యం చేసి SAP Analytics ఉపయోగించి ఉన్నత స్థాయి నిర్వహణ కోసం డాష్‌బోర్డులను అభివృద్ధి చేసింది మరియు ముఖ్యమైన KPI లను మరియు ఆన్‌లైన్ ఉత్పత్తి, రాష్ట్ర డిమాండ్ మరియు జలాశయ నీటి స్థాయిలు తీసుకురావడానికి మొబైల్ అప్లికేషన్‌ను అమలు చేసింది. ఇవన్నీ, ఒకే ఏకీకృత ప్లాట్‌ఫారమ్‌లో అభివృద్ధి పరచి అమలు చేయబడ్డాయి. ఈ ఆదర్శప్రాయమైన ఐటి అమలులు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సిఎస్ఐ SIG ఇ-గవర్నెన్స్ అవార్డ్స్ 2018-19 నుండి దేశీయ స్థాయిలో ప్రాజెక్టులు – రాష్ట్ర వర్గం కింద గౌరవనీయమైన అవార్డును పొందాయి.
ప్రముఖ నిపుణుల జ్యూరీ మరియు సిఎస్ఐ స్పెషల్ ఇంటరెస్ట్ గ్రూప్ (ఎస్ఐజి) నుండి అవార్డు సెక్రటేరియట్ 18.11.2019 న క్షేత్ర సందర్శనలో భాగంగా ఇఆర్పి ప్రాజెక్ట్ కార్యాలయాన్ని సందర్శించి, ఫైనలిస్ట్ కోసం ప్రాజెక్ట్ను ఎంపిక చేసింది. షార్ట్‌లిస్ట్ చేసిన ప్రాజెక్టులలో జ్యూరీకి తుది ప్రదర్శన 18.12.2019 న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది. సమగ్ర మైన ప్రశ్న జవాబులు మరియు క్రాస్ ఎగ్జామినేషన్ తరువాత, పెద్ద సంఖ్యలో నామినేషన్లు మరియు ప్రెజెంటేషన్ల నుండి వడపోసి ఈ ప్రాజెక్ట్ ‘ఎక్సలెన్స్ అవార్డుకు’ అర్హతగా ప్రకటించబడింది.జనవరి 17, 2020 న భువనేశ్వర్లోని KIIT (కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ) వద్ద జరిగిన 53 వ CSI వార్షిక సదస్సులో CSI SIG ఇ-గవర్నెన్స్ అవార్డును TSGENCO ప్రాజెక్టుకు ప్రధానం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అద్భుతంగా పనిచేసినందుకు తెలంగాణ జెన్కో ను, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు డాక్టర్ ఎంసిఆర్ హెచ్ఆర్డి డైరెక్టర్ జనరల్ అయిన శ్రీ బి పి ఆచార్య అభినందించారు.