మే 12న ఎంసెట్..18న ఐసెట్

223
TS Eamcet to be held on May 12
- Advertisement -

2017–18 వివిధ వృత్తి విద్యా కోర్సు ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీఈసెట్‌ పరీక్షలు జరగనున్నాయి.  మే 6న టీఎస్‌ ఈసెట్‌, మే 12న టీఎస్‌ ఎంసెట్‌, మే 16న పీసెట్, మే 18న ఐసెట్‌, మే 27న లాసెట్‌, అదే రోజు పీజీ ఎల్‌సెట్‌, మే 28న ఎడ్‌ సెట్‌, మే 30న పీజీఈసెట్‌ నిర్వహించనున్నారు.

ఈ సెట్, ఎంసెట్ నిర్వహణ బాధ్యతను కూకట్ పల్లి జేఎన్టీయూకు అప్పగించింది. పీఈ సెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్ నిర్వహణ బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించింది. ఐసెట్, లాసెట్, పీజీ లాసెట్ ను వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ ఎంట్రన్స్‌ల ద్వారా బీఈ/బీటెక్‌, బీ ఫార్మసి, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, బీపీఈడీ, ఎల్‌ఎల్‌బీ, ఎంటెక్‌, ఎంఫార్మసి లాంటి యూజీ, పీజీ ప్రొఫెషనల్‌ కోర్సులకు ప్రవేశాలు జరుగుతాయి.

ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలను సబ్జెక్టులవారీగా నిర్వహించడం తేలికని, అందుకోసమే ప్రయోగాత్మకంగా పీజీఈసెట్, ఈసెట్ వంటి ప్రవేశపరీక్షలను తొలుత ఆన్‌లైన్ పరీక్షలకు ఎంపిక చేశారు. సబ్జెక్టులవారీగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆన్‌లైన్ పరీక్షలు సాధ్యమని అంటున్నారు. ఎంసెట్ పరీక్షలో సబ్జెక్టులు ఉండకపోవడంతో.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఒకే కామన్ పేపర్ ఉంటుంది.

- Advertisement -