ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్…

180
ts eamcet
- Advertisement -

రేపు ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్న నేపథ్యంలో ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.రెండు దశల్లో ఎంసెట్. కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కొరకు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పించేందుకు తెలంగాణ ఉద్యమ విద్యామండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ నమోదుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ నెల 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించనున్నారు. ఈ నెల 12 నుంచి 20 వరకు ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది.

22న మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు. 29 నుంచి ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగనుంది. 30న తుది విడత ధ్రువపత్రాల పరిశీలిస్తారు. 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. నవంబర్‌ 2న ఇంజినీరింగ్‌ తుది విడుత సీట్ల కేటాయించనున్నారు. 4న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు.

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది ఎం సెట్‌ నిర్వహణ ఆలస్యమైంది. గత సెప్టెంబర్‌లో నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించారు. తెలంగాణ, ఏపీలో 102 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1లక్ష43 వేల165 మంది ప‌రీక్షకు దరఖాస్తు చేశారు. అటు వచ్చే నెల రెండో వారం నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు క్లాసులు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -