- Advertisement -
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎంసెట్-2019 పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే మూడు నుంచి తొమ్మిది వరకు 94 కేంద్రాల్లో ఆన్‌లైన్ ఎంసెట్-2019 పరీక్ష నిర్వహించారు. ఇందుకు ఇంజినీరింగ్ విభాగంలో 1.42 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 74,981 మంది విద్యార్థులు హాజరయ్యారు. టీఎస్‌ఎంసెట్-2019 అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
- Advertisement -