గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న టీఎస్‌డీటీ కమిషనర్..

101
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా డిటిసి,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.కే. పాపారావు తన పుట్టినరోజు సందర్భంగా కొండాపూర్ ఆర్టిఓ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి విజయవంతంగా ముందుకు తీసుకువెళుతున్న ఎంపీ సంతోష్ కుమార్‌పై పాపారావు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ,డి.టి.సి.ప్రవీణ్ రావు,ఆర్.విజయరావు , సురేందర్ రెడ్డి, సత్యనారాయణ,వాసు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -