శాసనసభ మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ డిశ్ఛార్జ్ అయ్యారు. మూడు రోజులుగా సరోజిని కంటి ఆసుపత్రిలో స్వామిగౌడ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఆసుపత్రి ఆవరణలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనను పరామర్శించిన అన్ని పార్టీలకు చెందిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
అలాగే..చట్ట సభల సభ్యులంతా ఆయా సభల్లో హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యక్తులను గౌరవించకపోయినా సరే, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్వామిగౌడ్ అన్నారు. అంతేకాకుండా డ్రామాలు చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా..మూడు రోజుల క్రితం ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విసిరిన హెడ్‌ఫోన్ తగిలి స్వామిగౌడ్ కంటికి గాయమైంది. దాంతో ఆయన్ని హుటాహుటీన సరోజిని అసుప్రతిలో చేర్చిన విషయం తెలిసిందే.