ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్

12
- Advertisement -

అమెరికా – భారత్ మధ్య టారీఫ్‌ యుద్ధం నడుస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగాఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

నా 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినందుకు నా మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు. మీలాగే, నేను కూడా భారతదేశం – అమెరికా సమగ్ర, ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. యుక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేసే చొరవలకు మేము మద్దతు ఇస్తున్నాము అని మోదీ పేర్కొన్నారు.

 

Also Read:‘తెలుసు కదా’..షూటింగ్ పూర్తి

- Advertisement -