US Elections: కమలాతో డిబేట్‌కు ట్రంప్ ఓకే

7
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికు ఆసక్తికరంగా సాగుతున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ తరపున కమలా హారిస్ బరిలో ఉండగా రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తనతో డిబేట్‌కు రావాలని పలుమార్లు సవాల్ విసిరారు కమలా. అయితే ఏదో ఒక కారణం చెప్పి తప్పుకుంటున్న ట్రంప్ ఎట్టకేలకు ఓకే చెప్పాడు.

సెప్టెంబర్‌ 4 బుధవారం నాడు కమలా హారిస్‌తో డిబేట్‌ చేయడానికి ఫాక్స్‌ న్యూస్‌ చేసిన ప్రతిపాదనకు తాను అంగీకరించినట్లు ట్రంప్‌ తెలిపారు. గతంలో ఏబీసీలో బైడెన్‌తో చర్చ జరిగిందని గుర్తు చేశారు. అయితే, ఆ డిబేట్‌ అనంతరం బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నారు.

జూన్‌ 27న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌ మధ్య డిబేట్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలో ఇరువురు నేతలూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. తాజాగా కమలా – ట్రంప్ మధ్య డిబేట్ జరగనున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:భారత మార్కెట్‌లో ‘డెడ్ పూల్ & వోల్వరిన్’ హవా

- Advertisement -