అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో నెలకొన్న తాజా పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి వద్ద ఇరు దేశాల మధ్య దాడులు జరిగినప్పటికీ, కాల్పుల విరమణ ఇంకా అమలులోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇరాన్ గనుక శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
వాషింగ్టన్ డిసిలోని లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ సందర్శన సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు.అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ డ్రోన్లు మరియు క్షిపణులతో దాడి చేయడానికి ప్రయత్నించింది. దీనిని ట్రంప్ “ట్రిఫిల్” (అల్పమైనది/చిన్నపాటి గిల్లికజ్జా) అని అభివర్ణించారు.
వారు మాతో పెట్టుకున్నారు, మేము వారిని తుడిచిపెట్టేశాం అని చెబుతూ అమెరికా నౌకాదళం జరిపిన ఎదురుదాడిని సమర్థించారు. ఈ ఘర్షణలో అమెరికాకు చెందిన మూడు డిస్ట్రాయర్లకు ఎలాంటి నష్టం జరగలేదని, కానీ ఇరాన్ దళాలు భారీగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఒకవేళ కాల్పుల విరమణ ముగిసిపోతే పరిస్థితి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ట్రంప్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
కాల్పుల విరమణ ఉందో లేదో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇరాన్ నుండి ఒక భారీ కాంతి (విస్ఫోటనం) రావడం చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే, ఇరాన్ గనుక హద్దులు మీరితే ఆ దేశంపై అణు బాంబు లేదా అంతటి శక్తివంతమైన దాడులు చేస్తామన్న సంకేతాలను ఆయన పరోక్షంగా ఇచ్చారు.
Also Read:రక్తం గడ్డకట్టడం..ప్రమాదకర సంకేతాలు!

