రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో అమెరికా అభిప్రాయాలకు అనుగుణంగా భారత్ వ్యవహరించకపోతే, భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను “చాలా వేగంగా” పెంచవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. రష్యన్ ఆయిల్‌పై భారత్ తీసుకుంటున్న నిర్ణయాలకు తన అసంతృప్తిని ట్రంప్ నేరుగా అనుసంధానించారు.
ఇందుకు సంబంధించి ఓ ఆడియో రిలీజ్ కాగా భారత్ తనను సంతృప్తిపరిచేందుకు తన విధానాలను మార్చుకుందని ట్రంప్ పేర్కొన్నారు. వారు నన్ను సంతోషపెట్టాలనే ప్రయత్నం చేశారు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ…మోదీ చాలా మంచి వ్యక్తి. ఆయన మంచి నాయకుడు. నేను అసంతృప్తిగా ఉన్నానని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం ఆయనకు ముఖ్యమైంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అలాగే వాణిజ్యంపై హెచ్చరిస్తూ..వారు వాణిజ్యం చేస్తున్నారు. మేము చాలా త్వరగా టారిఫ్‌లను పెంచగలం. అది వారికి చాలా నష్టం చేస్తుంది అని స్పష్టం చేశారు.రష్యా ఆర్థిక వ్యవస్థ బాగా లేదు. కానీ నిజంగా అత్యంత దారుణంగా ఉన్నది వెనిజువెలా ఆర్థిక వ్యవస్థ. నేను చూసిన వాటిలో అది అత్యంత చెత్త ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వాషింగ్టన్‌తో సున్నితమైన చర్చలు జరుగుతున్న వేళ, భారత్ తన చమురు దిగుమతుల వివరాలను పునఃసమీక్షిస్తున్న నేపథ్యంలో వచ్చాయి.
Also Read:చంద్ర గ్రహణం..శ్రీవారి ఆలయం మూత

