అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చైనాలో పర్యటించాల్సిందిగా జిన్‌పింగ్ ట్రంప్‌ను ఆహ్వానించారు.
ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’ లో వెల్లడించారు. అంతేకాకుండా, తాను కూడా ఆ తర్వాత అమెరికాలో పర్యటించాల్సిందిగా జిన్‌పింగ్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు.
గత నెలలో దక్షిణ కొరియాలో జరిగిన సమావేశం తర్వాత ట్రంప్ మరియు జిన్‌పింగ్ ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా, రెండు దేశాల అధ్యక్షుల మధ్య అనేక కీలక అంతర్జాతీయ మరియు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా, తైవాన్, ఉక్రెయిన్ సంక్షోభం వంటి కీలక విషయాలతో పాటు, మాదక ద్రవ్యం ఫెంటనిల్ నియంత్రణ మరియు సోయా కొనుగోళ్ల వంటి వాణిజ్యపరమైన అంశాలు చర్చకు వచ్చాయి. ఇద్దరు నేతల మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రపంచ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read:లోకల్ బాడీ ఎన్నికలు..మండలాల వారీగా వివరాలు


