కెనడాతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) సంబంధాలు బలోపేతం కావడంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయూ భాగస్వామ్యాన్ని అమెరికాకు వ్యతిరేకంగా చేసే “శత్రుత్వ చర్యగా” పరిగణిస్తే ఐరోపా దేశాలపై అత్యంత భారీ సుంకాలను విధిస్తామని హెచ్చరించారు.యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, కెనడాను ఈయూలో “తొలి అనుబంధ సభ్య దేశం” గా చేయాలని ప్రతిపాదించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు
ఈయూ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి సభ్యత్వం కేవలం ఐరోపా ఖండానికి చెందిన దేశాలకు మాత్రమే పరిమితం. అందువల్ల కెనడా పూర్తిస్థాయి సభ్యురాలిగా చేరడం సాధ్యపడదు.ఈ ప్రతిపాదిత ‘అనుబంధ సభ్యత్వం’ అనేది 27 సభ్య దేశాలు కలిగిన ఈయూతో కెనడాకు అత్యంత లోతైన ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది. ఇది ‘సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం’ స్థానంలో “భవిష్యత్ కూటమి” అనే కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది.
ఈ ప్రతిపాదిత భాగస్వామ్యం కేవలం సాధారణ వాణిజ్యానికే పరిమితం కాకుండా విస్తృతమైన రంగాలలో సహకారాన్ని అందిస్తుంది:సాంకేతికత & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రక్షణ రంగ పారిశ్రామిక సహకారం, ఆర్కిటిక్ పరిశోధనలు & ప్రాజెక్టులు, ఇంధనం & కీలకమైన ఖనిజాలు,క్వాంటమ్ టెక్నాలజీస్ & సైబర్ సెక్యూరిటీ,ఇంటెలిజెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ & ఆర్థిక భద్రత.
Also Read:వెరైటీ డిషెస్..ఆసక్తికర అంశం!
అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల హెచ్చరికల కారణంగా కెనడా తన ఆర్థిక సంబంధాలను అమెరికాపై మాత్రమే ఆధారపడకుండా ఇతర దేశాలతో విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఐరోపాతో సంబంధాలను పెంచుకోవడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం వెనుక “చెడు ఉద్దేశం” ఉంటే లేదా అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉంటే దానిని ఒక శత్రుత్వ చర్యగా పరిగణించి ఈయూ నుండి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామని లేదా అనేక రంగాల్లో వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

