ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అమెరికా వైదొలగింది. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. వైట్‌హౌజ్ చేరుకున్న తర్వాత ఆయన పలు డాక్యుమెంట్లపై సంతకం చేశారు.
డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకోవాలని ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం ఇది రెండోసారి. కోవిడ్19 సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సరైన రీతిలో వ్యవహరించలేదని గతంలో కూడా ట్రంప్ ఆరోపించారు. జెనీవాకు చెందిన ఆ సంస్థ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నట్లు గతంలోనూ వెల్లడించారు. కానీ బైడెన్ ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు.
తాజాఆ మరోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలిగారు ట్రంప్. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అవసరం చాలా ఉందని, కానీ ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అన్నారు. డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా అందజేస్తున్న ఆర్థిక సాయంలో కూడా అవకతవకలు జరిగినట్లు చెప్పారు.
Also Read:దేవుని కడప బ్రహ్మోత్సవాలు