ఏప్రిల్ నుండి భారత్‌పై సుంకాలు విధించనున్నట్లు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ప్రసంగించిన ట్రంప్.. భారత్, చైనా, కెనడా దేశాలపై సుంకాలు విధించనున్నట్లు స్పష్టం చేశారు.
భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి అమలులోకి రానున్నట్లు ట్రంప్ ప్రకటించారు. యూరోపియన్ యూనియన్, చైనా బ్రెజిల్, భారత్ వంటి చాలా దేశాలు తమ నుంచి అధిక సుంకాలు వసూలు చేస్తున్నాయి. ఇది చాలా అన్యాయం అని ట్రంప్ చెప్పారు.
భారత్… అమెరికాపై వంద శాతం కంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తుంది. ఇక అమెరికా వసూలు చేసే దానికంటే చైనా రెండింతలు ఎక్కువగా సుంకాలు విధిస్తోంది. ఇప్పుడు తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత… తాము కూడా సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. ఏ దేశాలు.. తమ ఉత్పత్తులపై ఎంత టారిఫ్‌లు విధిస్తాయో.. తాము కూడా అంతే సుంకాల్ని వసూలు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
Also Read:పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి..
అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సెషన్లో ప్రసంగించడం ఇదే తొలిసారి.

