- Advertisement -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో రోజురోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఇమ్మిగ్రేషన్ రద్దు చేశారు. అమెరికన్ల ఉద్యోగాల్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
కంటికి కనిపించని శతృవు దాడి చేస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. తమ దేశ యువత ఉద్యోగాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే తాత్కాలికంగా ఇమిగ్రేషన్లను రద్దు చేసినట్లు చెప్పారు.
అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 7 లక్షల 92 వేలు దాటింది. అమెరికాలో ఇప్పటి వరకు కరోనాతో 42,514 మంది మృతి చెందారు. అమెరికాలో నిన్న ఒక్కరోజే 1939 మంది ప్రాణాలు కోల్పోయారు.
- Advertisement -