కరోనా వైరస్ నేపథ్యంలో చైనాను డబ్ల్యూహెచ్‌వో వెనకెస్తుందన్న ఆరోపణలతో ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుండి తప్పుకుంటున్నట్లు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో నుండి తప్పుకుంటున్నట్లు అమెరికా కాంగ్రెస్, ఐక్య రాజ్యసమితికి తెలిపారు.
తాజాగా ఇందుకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకునేందుకు అమెరికా తమకు నోటిఫై చేసినట్లు యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టిఫేన్ డుజారిక్ తెలిపారు. ఇందుకు ఏడాది సమయం పట్టనుండగా ఉపసంహరణ ప్రక్రియ 2021 జూలై 6 వరకు పూర్తికానున్నట్లు తెలుస్తున్నది.
డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా తప్పుకోవడంపై స్పందించారు అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న జోసెఫ్ బైడెన్. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే.. డబ్ల్యూహెచ్‌వోతో మళ్లీ కలిసి పనిచేసే పత్రంపై సంతకం చేయనున్నట్లు చెప్పారు.