పుతిన్‌తో చర్చలపై ట్రంప్

9
- Advertisement -

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో వృథా సమావేశం జరగకూడదని వ్యాఖ్యానించారు ట్రంప్. దీనికి తగ్గట్లే వీరిద్దరి మధ్య రెండవ సమావేశం ప్రణాళికను రద్దు చేయడం ద్వారా వైట్ హౌస్, అలాంటి మరో నిరుపయోగ చర్చను తప్పించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

రష్యన్లు చాలా ఎక్కువ కోరుకున్నారు. బుడాపెస్ట్‌లో ట్రంప్‌కు ఎటువంటి ఒప్పందం దొరకదని అమెరికన్లు గ్రహించారు అని ఒక యూరోపియన్ రాయబారి తెలిపారు.

ఈ వారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ల మధ్య ప్రాథమిక సమావేశం జరగాల్సి ఉండగా, ఇద్దరూ “ఫలప్రదమైన” ఫోన్ సంభాషణ జరిపారని, ప్రత్యక్ష భేటీ అవసరం లేదని వైట్ హౌస్ తెలిపింది.

యూరోపియన్ నాయకులు, జెలెన్‌స్కీతో కలిసి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఉక్రెయిన్ యుద్ధం ముగించే చర్చలు ప్రస్తుత ఫ్రంట్‌లైన్ “ఫ్రీజ్” చేయడం నుంచే ప్రారంభం కావాలని చెప్పారు. రష్యా “శాంతి పట్ల నిజాయితీగా వ్యవహరించడం లేదు” అని ఆరోపించారు. , జెలెన్‌స్కీ మాత్రం ఉక్రెయిన్ ఇప్పటికీ నియంత్రణలో ఉంచుకున్న డోన్బాస్ ప్రాంతాలను ఎప్పటికీ వదులుకోలేమని, రష్యా మళ్లీ దానిని దాడికి ఉపయోగించే ప్రమాదం ఉందని చెబుతూనే ఉన్నాడు.

Also Read:కే ర్యాంప్..బ్రేక్ ఈవెన్!

- Advertisement -