ఇరాన్‌కుఅణ్వాయుధాలు ఉండనివ్వం!

6
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన 2026 స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఇరాన్‌పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు అణ్వస్త్రాలు ఉండనివ్వలేం అని స్పష్టంగా పేర్కొన్నారు. 2025లో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా నిర్వహించిన వైమానిక దాడి ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా దెబ్బతీసిందని ట్రంప్ అన్నారు. ఆ ఆపరేషన్ లేకపోతే ఇరాన్ తీవ్రవాదాన్ని విస్తరించేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇరాన్ యూరప్ మరియు విదేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే క్షిపణులను ఇప్పటికే అభివృద్ధి చేసిందని, త్వరలో అమెరికాను తాకగల దీర్ఘశ్రేణి క్షిపణులు కూడా తయారు చేసే ప్రయత్నంలో ఉందని ట్రంప్ తెలిపారు. అయితే 2025లో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రకారం, ఇరాన్ 2035 నాటికి అంతర్మహాద్వీప బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం సాధించే అవకాశముందని పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 3,000 కిలోమీటర్ల పరిధి గల స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులు ఉన్నాయి.

Also Read:షూతో కీళ్ల నొప్పులు..షాకింగ్!

అమెరికా–ఇరాన్ మధ్య అణు ఒప్పందం పునరుద్ధరణకు చర్చలు కొనసాగుతున్నాయి. యురేనియం శుద్ధి పూర్తిగా నిలిపివేయాలని అమెరికా కోరుతుండగా, ఇరాన్ దీనిని తిరస్కరిస్తోంది. ఇదిలా ఉండగా, మధ్యప్రాచ్యంలో అమెరికా రెండు విమాన వాహక నౌకలు సహా భారీ సైనిక బలగాలను మోహరించింది. చర్చలు విఫలమైతే ఇరాన్‌పై దాడి చేస్తామని ట్రంప్ మరోసారి హెచ్చరించారు.

- Advertisement -