జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌..మరోసారి కామెంట్!

1
- Advertisement -

 అమెరికాలో జన్మతః పౌరసత్వాన్ని తొలినాళ్లలో బానిసల పిల్లల కోసమే తీసుకొచ్చారని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే, ఈ చట్టం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి అమెరికాలో స్థిరపడేందుకు ఉద్దేశించినది కాదని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ పదులకొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు. వాటిలో అత్యంత వివాదాస్పదంగా మారిన నిర్ణయాల్లో జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న ఉత్తర్వు ఒకటి. అయితే, ఈ ఆదేశాన్ని న్యాయస్థానం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా ఈ అంశంపై స్పందించారు.

బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతోనే జన్మతః పౌరసత్వాన్ని అప్పట్లో తీసుకొచ్చారు. కానీ, ఇప్పుడు అర్హత లేని అనేక మంది ఈ చట్టాన్ని అడ్డుగా పెట్టుకుని అమెరికా పౌరసత్వం పొందుతున్నారు. ఇది అసలు ఉద్దేశానికి విరుద్ధం. జన్మతః పౌరసత్వ చట్టాన్ని నేను సుప్రీంకోర్టులో ప్రశ్నిస్తాను. మా వాదనకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకం నాకుంది అని ట్రంప్ పేర్కొన్నారు.

Also read:పార్టీ ఫిరాయింపులు..బీఆర్ఎస్ పిటిషన్ వాయిదా

- Advertisement -