Trump:బీబీసీపై ట్రంప్ దావా!

5
- Advertisement -

బీబీసీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. నోర‌మా సిరీస్ డాక్యుమెంట‌రీ కోసం ట్రంప్ ప్ర‌సంగాన్ని బీబీసీ వాడుకున్న‌ది. కానీ ఆ ప్రోగ్రామ్‌లో ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొట్టే రీతిలో ట్రంప్‌ ప్ర‌సంగాన్ని ఎడిట్ చేశారు. ఈ అంశంలో బీబీసీ సంస్థ ఇప్ప‌టికే క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

త‌న ప్ర‌సంగాన్ని ఎడిట్ చేసి త‌ప్పుగా ప్ర‌సారం చేసిన బీబీసీ వార్తాసంస్థ‌పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌ష్ట‌ప‌రిహారాన్ని కూడా వ‌సూల్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. క‌నీసం బిలియ‌న్ నుంచి 5 బిలియ‌న్ల డాల‌ర్ల ప‌రిహారాన్ని కోర‌నున్న‌ట్లు వెల్లడించారు. 2021, జ‌న‌వ‌రి 6వ తేదీన చేసిన ప్ర‌సంగాన్ని బీబీసీ త‌ప్పుగా ఎడిట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

క్యాపిట‌ల్ హిల్ హింస‌కు ప్రేరేపించిన‌ట్లు ఆ ప్ర‌సంగంలో ఉన్న‌ది. ఈ ఘ‌ట‌న‌తో లింకున్న బీబీసీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టిమ్ డేవ్‌, న్యూస్ హెడ్ దెబోరా ట‌ర్నెస్ రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.

Also Read:తిమ్మక్క మరణం బాధ కలిగించింది!

- Advertisement -