Trump:ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ముగిసింది

8
- Advertisement -

ఇరాన్ , ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంపై కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్‌డట్రంప్. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. మరో ఆరు గంటల్లో ఈ ప్రక్రియ ప్రారంభమై.. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది అని పేర్కొన్నారు.

తొలుత ఇరాన్ కాల్పుల విమరణను ప్రారంభించనుంది. అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరించనుంది. దీంతో 12రోజుల యుద్ధానికి ఎండ్ కార్డు పడనుంది అని తెలిపారు ట్రంప్. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేటప్పుడు మరో దేశం శాంతి, గౌరవంతో ఉండాల్సి ఉంటుంది అని తెలిపారు.

ఇజ్రాయెల్ , ఇరాన్ తో సహా మధ్యప్రాచ్యం, ప్రపంచ దేశాలతోపాటు అమెరికాకు దేవుడి దయ ఉంటుంది అని ట్రంప్ తెలపగా అయితే కాల్పుల విరమణపై ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read:‘3 BHK’ …సెకండ్ సింగిల్

- Advertisement -