ట్రంప్ … పట్టాభిషేకం

111
Trump journey begins

డోనాల్డ్ జాన్ ట్రంప్.. అమెరికా 45వ అధ్యక్షుడిగా అగ్రరాజ్యం భవిష్యత్తును నిర్ణయించబోయే ప్రజానేత. కఠినతరమైన సవాళ్లను ఎదుర్కొని బలమైన ప్రత్యర్థిని చిత్తుచేసిన విజేత. అమెరికా నూతన నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్ టన్‌ డిసిలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్ అమెరికా ఫస్ట్ అనేదే నినాదమని అమెరికన్ల మీదుగానే దేశ పనర్నిర్మాణం జరగాలన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాకం నిన్న ప్రారంభమైంది. నిన్న రాత్రి 10 గంటలకు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అబ్రహాం లింకన్ ఉపయోగించిన బైబిల్‌పై చేతిని ఉంచి ఆయన ప్రమాణం చేశారు.

చరిత్రాత్మకమైన ఈ బైబిల్‌ను ఇదివరకు బరాక్ ఒబామా 2009లో, 2013లో తన ప్రమాణ స్వీకారానికి ఉపయోగించారు. అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. కాగా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తి క్లారెన్స్ థామస్ పదవీ ప్రమాణం చేయించారు.

డోనాల్డ్‌ ట్రంప్‌ గురువారం న్యూయార్క్‌ నగరం నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్నారు. ఆయన వెంట భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, కుమారులు డాన్‌, ఎరిక్‌లు కూడా ఉన్నారు. ట్రంప్‌ టవర్‌ నుంచి విమానాశ్రయం చేరుకున్న డోనాల్డ్ ప్రైవేటు విమానంలో కాకుండా అధికారిక లాంఛనాలతో సైనిక జెట్‌ విమానంలో ప్రయాణించారు.

Trump journey begins

ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారతీయ అమెరికన్లు సహా వేలాది మంది హాజరుకానున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ట్రంప్ ఎన్నికల నినాదాన్ని ప్రమాణ స్వీకారోత్సవానికి థీమ్‌గా నిర్ణయించారు. వాషింగ్టన్ డీసీలో జరిగే ఈ కార్యక్రమానికి కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయడంతోపాటు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జాతినుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.

అమెరికా అధ్యక్షుడిగా ఓ వైపు ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనుండగా మరోవైపు నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. ట్రంప్ మా అధ్యక్షుడు కాదంటు నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ట్రంప్ పేరు వింటే అమెరికాతో క‌లిసి నాటో ర‌క్ష‌ణ కూట‌మిలో ఉన్న బాల్టిక్ దేశాలు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నాయి. ముఖ్యంగా మెక్సికోకు ట్రంప్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అమెరికాలో అక్ర‌మంగా నివ‌సిస్తున్న ల‌క్ష‌లాదిమంది మెక్సిక‌న్ల‌ను తిరిగి పంపించేస్తాన‌ని, అమెరికా, మెక్సికో స‌రిహ‌ద్దులో గోడ క‌డ‌తాన‌ని ప‌లుమార్లు హెచ్చ‌రించిన ట్రంప్ ప‌గ్గాలు చేప‌ట్టాక అనుకున్నంతా చేస్తారే‌మోన‌ని మెక్సికో ఆందోళ‌న చెందుతోంది.