ట్రంప్- జిన్‌పింగ్ శిఖరాగ్ర భేటీ

3
- Advertisement -

ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల మధ్య సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన కీలక శిఖరాగ్ర సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది. ఈ సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ..ఇద్దరం కలిసి ఒక అద్భుతమైన భవిష్యత్తును నిర్మించబోతున్నాం అని షీ జిన్‌పింగ్‌తో చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, సహకారం వైపు అడుగులు వేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, సుంకాల విధింపు వంటి అంశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. ఇరు దేశాల ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూనే, పరస్పర వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రపంచ శాంతిని కాపాడటంలో అమెరికా, చైనాల పాత్ర కీలకమని, ఉగ్రవాదం మరియు ప్రాంతీయ ఉద్రిక్తతల నియంత్రణలో కలిసి పనిచేస్తామని ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా ట్రంప్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. చైనా-అమెరికా సంబంధాలు కేవలం రెండు దేశాలకే పరిమితం కాదని, అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. పరస్పర గౌరవంతో ముందుకు సాగడం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:సీఎస్‌కేకు భారీ షాక్..స్టార్ ఆటగాడు దూరం!

గత కొన్నేళ్లుగా ఉప్పు-నిప్పులా ఉన్న అమెరికా-చైనా సంబంధాలు ఈ భేటీతో మళ్లీ గాడిలో పడతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ‘ఫెంటాస్టిక్ ఫ్యూచర్’ ప్రకటన కేవలం మాటలకే పరిమితం అవుతుందా లేక ఆచరణలోకి వస్తుందా అన్నది వేచి చూడాలి.

- Advertisement -