తీవ్ర సైనిక చర్యకు సిద్ధం: ట్రంప్

1
- Advertisement -

ఇరాన్‌తో జరుగుతున్న దౌత్య చర్చలు విఫలమైతే, ఆ దేశంపై  చాలా తీవ్రమైన సైనిక చర్యను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అదే సమయంలో, చర్చలకు మరొక అవకాశం ఇచ్చేందుకే ప్లాన్ చేసిన దాడిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన ధృవీకరించారు. ఆక్సియోస్ నివేదిక ప్రకారం..ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ‘స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్’ ను తిరిగి తెరవడం మరియు ఇరాన్‌తో విస్తృత అణు ఒప్పందంపై చర్చలను పునరుద్ధరించడం అనే అంశాలపై దృష్టి సారించాయి.

ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ మరియు ఒమాన్ నేతృత్వంలో జరుగుతున్నాయి. వీటిలో ఖతార్, పాకిస్తాన్, ఈజిప్ట్, ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరియు సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. శాంతియుత చర్చలే ప్రాధాన్య మార్గమని అయితే అవి విఫలమైతే సైనిక చర్య ప్రత్యామ్నాయంగా ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. మేము ఇరాన్‌తో చాలా లోతైన చర్చలు జరుపుతున్నాము. అవి ఫలించకపోతే, మేము మళ్లీ తీవ్రమైన సైనిక చర్యలకు దిగుతాము అని ట్రంప్ ఆక్సియోస్‌తో అన్నారు.

దౌత్యానికి ఎంత సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అడిగినప్పుడు, ట్రంప్ “ఎక్కువ సమయం లేదు. ఇది త్వరగా జరగాలి, లేదంటే అసలు జరగదు” అని సమాధానమిచ్చారు. దీని ద్వారా ఇరాన్‌తో చర్చలకు సమయం చాలా పరిమితంగా ఉందని, చర్చలు విఫలమైతే సైనిక చర్య తప్పదని ఆయన సూచించారు.

Also Read:KCR:మా పెద్దిని కాపాడండి

- Advertisement -