అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల అంశంపై మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ దేశాలపై విధించిన అదనపు సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు ఆఫ్ అమెరికా తీర్పు వెలువరించిన మరుసటి రోజే ఆయన సుంకాలను మళ్లీ పెంచారు. మొదట 10 శాతం సుంకాలు విధించిన ట్రంప్, తాజాగా వాటిని 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.
సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఏమీ మారదని, తన ఆర్థిక విధానాలు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “ఇండియా సుంకాలు చెల్లిస్తుంది కానీ మేము చెల్లించము. గతంలో మేము సుంకాలు చెల్లించాం, ఇప్పుడు ఇండియానే మాకు సుంకాలు చెల్లిస్తుంది” అని పేర్కొన్నారు.
అమెరికా సుంకాలు చెల్లించకుండా భారతదేశంతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నామని కూడా ఆయన వెల్లడించారు. ఈ ప్రకటనలతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ తాజా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ALso Read:ఆసీస్ గడ్డపై భారత మహిళ జట్టు అద్భుతం

