ట్రంప్ – బైడెన్‌ రెండో డిబేట్ రద్దు…

225
trump

నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా ట్రంప్‌, డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా బైడెన్ పోటీప‌డుతున్నారు.ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరి పోరు జరుగుతుండగా తొలి డిబేట్‌ సెప్టెంబర్‌ 30న జరుగగా అక్టోబర్‌ 15న రెండోది, 22న మూడోది జరగనున్నాయి.

అయితే అక్టోబర్ 15న జరగాల్సిన సెకండ్ డిబేట్ రద్దయింది. ఆ చ‌ర్చ‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు క‌మిష‌న్ ఆన్ ప్రెసిడెన్షియ‌ల్ డిబేట్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. వ‌ర్చువ‌ల్ ఫార్మాట్‌లో తాను పాల్గొన‌బోన‌ని ట్రంప్ వెల్ల‌డించ‌డంతో క‌మిష‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

అధ్య‌క్షుడు ట్రంప్ క‌రోనా వైర‌స్ పాజిటివ్ తేల‌డంతో.. ఈనెల 15వ తేదీన జ‌ర‌గాల్సిన డిబేట్‌ను వ‌ర్చువ‌ల్‌గా మారుస్తున్న‌ట్లు ఇటీవ‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. కానీ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు ట్రంప్. ఒక‌వేళ ట్రంప్‌కు ఇంకా వైర‌స్ ఉంటే, తాను రెండ‌వ డిబేట్‌లో పాల్గొనేదిలేద‌ని బైడెన్ సైతం వెల్లడించారు. ఇక చివ‌రి డిబేట్ ఈనెల 22వ తేదీన టెన్నిసెసిలో జ‌ర‌గాల్సి ఉంది.