ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా శాఖ డీటీసీ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారి కె.పాపారావు ఆధ్వర్యంలో శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు రూట్లలో హయత్ నగర్, ఎల్ బి నగర్, మియాపూర్, కోకాపేట్, పటాంచెరువు ప్రాంతాల్లో అధిక బరువు తో తిరుగుతున్న లారీ ల ను పట్టుకొని సీజ్ చేయడం జరిగినది. పదవి భాద్యతలు చేపట్టినప్పటి నుండి పలు దఫాలుగా అక్రమంగా తిరుగుతున్న పలు రకాల వాహనాల పై కొరడా జులిపిస్తునేవున్నారు. ఈ దఫా యధేచ్చగా అధిక బరువు తో తిరుగుతున్న లారీలపై ప్రత్యేక దృష్టి సారించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో పని చేస్తున్న 15 మంది వాహన తనిఖీ అధికారులను మరియు ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్స్ మరియు హోమ్ గార్డ్స్ ను హెడ్ ఆఫీసుకు పిలిపించి 5 బృందాలుగా ఏర్పాటు చేసి హైదరాబాదులోని వివిధ రూట్లలో అధిక బరువు తో తిరుగుతున్న లారీ ల పై పెద్ద ఎత్తున 16 వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేయించారు .
16వ తారీకు రాత్రి 10 గంటలనుండి 17వ తారీఖు ఉదయం 6 గంటల వరకు వందలాది లారీలను తనిఖీ చేసి అధిక బరువు తో తిరుగుతున్న 75 లారీలను సీజ్ చేయడం జరిగినది. డిటిసి పాపారావు గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రాష్ట్రానికి 10 లక్షలకు మించి ఆదాయాన్ని జరిమానా రూపేన ఒక్కరాత్రిలోనే రాష్ట్రానికి రాబట్టడం ముఖ్య విశేషం.తెలంగాణ ప్రజలకు ఎన్నో ప్రయోజనకరమైన ఉత్తమోత్తమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రముఖ ఆదాయాన్ని చేకూర్చే వనరుగా వున్న రవాణాశాఖ ద్వారా రాష్ట్రానికి పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాల నుండి పన్నులు మరియు అక్రమంగా తరలిస్తున్న వాహనాల పై జరిమానా రూపేన ఆదాయాన్ని చేకూర్చాలనుకున్నారు.
అక్రమంగా తిరుగుతున్న వాహనాల పై మరియు అధిక బరువు తో తిరుగుతున్న లారీ ల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప రవాణా కమిషనర్ కె. పాపారావు తెలిపారు. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం ను అమెండ్ చేసిన నేపథ్యంలో భవిష్యత్తు లో భారీగా జరిమానాలు అక్రమంగా తిరుగుతున్న వాహనాల పై విధించడం జరుగుతోంది. రవాణశాఖ లో సమున్నత మార్పులకు, ప్రజలకు సత్వర సేవలు అందుబాటులోనికి పారదర్శకంగా తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిర్దేశించిన ఆర్ఠిక లక్ష్యాలను రవాణాశాఖ సునాయాసంగా చేరుకుంటుందని చెప్పారు. ఉప రవాణా కమిషనర్ రోడ్డు భద్రత పై అవగాహన సదస్సులు పెద్ద ఎత్తున నిర్వర్తిస్తున్నట్టు గా తెలిపారు.
రోడ్డు భద్రత ప్రతి పౌరుని బాధ్యత అనే నినాదాన్ని గుర్తెరిగి రోడ్డు నిబంధనలను మరియు మోటారు వాహనాల చట్టం యొక్క నిబంధనలను పాటించాలని రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ కుటుంబాలతో సంతోషంగా జీవించాలని, రోడ్డు ప్రమాదాలు లేని సమ సమాజ నిర్మాణానికి బంగారు తెలంగాణ నిర్మాణానికి తోడ్పడాలని ప్రజలను వేడుకున్నారు.