- Advertisement -
గత కొన్ని రోజులుగా కొందరు కావాలనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్ రావుపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెడుతున్నారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీఆర్‌ఎస్ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. వారిని త్వరలోనే కనిపెట్టి శిక్షిస్తామని పోలీసు అధికారి తెలిపారు.
- Advertisement -