ఈ నెల 13న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా లోక్ సభ,రాజ్యసభ సభ్యులను ఆహ్వానించారు. ఈ నెల 17 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో టిఆర్ఎస్ ఎంపిలు అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిలతో చర్చించనున్నారు.
భారత పార్లమెంట్ సమావేశాలు జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభలో అత్యంత సీనియర్ అయిన ఎంపీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించి కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం జూన్ 19న కొత్త స్పీకర్ను ఎన్నుకొంటారు. ప్రొటెం స్పీకర్‌గా అత్యంత సీనియర్ అయిన మేనకాగాంధీని ఎంపికయ్యే అవకాశం ఉంది.15వ లోక్‌సభలో స్పీకర్‌గా మీరా కుమార్, 16వ లోక్‌సభలో స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ వ్యవహరించారు. దీంతో వరుసగా మూడోసారి కూడా మహిళకే స్పీకర్ పదవి దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి.
జూన్ 19న కొత్త స్పీకర్ ఎన్నిక,జూన్ 20న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం,జూలై 4న ఎకనామిక్ సర్వేను సభలో సమర్పిస్తారు,జూలై 5న 2019వ సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు