మళ్లీ మనదే అధికారం..

213
TRSLP meeting today
- Advertisement -

2019 ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీకే అధికారం ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని కేసీఆర్‌ తెలిపారు. ఇదిలా ఉంటే..సర్వేలో మళ్లీ సీఎం కేసీఆరే నెంబర్ వన్ గా నిలిచారు. 98 శాతంతో కేసీఆర్ తొలి స్థానంలో నిలవగా… 96శాతంతో కేటీఆర్ రెండో స్థానం, 88 శాతంతో హరీశ్ మూడోస్థానం దక్కించుకున్నారు.

అయితే అనూహ్యంగా తాటికొండ రాజయ్య నాలుగో స్థానం దక్కించుకున్నారు. శనివారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి  పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
 TRSLP meeting today
పార్టీ సభ్యత్వాలు, కమిటీల ఏర్పాటు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌ పార్టీకి 111 సీట్లు రావడం ఖాయమని ముఖ్యమత్రి కేసీఆర్‌ వెల్లడించారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశంలో  కేసీఆర్‌ సర్వే నివేదికను బయటపెట్టారు. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గానూ టీఆర్‌ఎస్‌కు 111, మిత్రపక్షం ఎంఐఎంకు 6 సీట్లు, విపక్షాలకు కేవలం 2 సీట్లు వస్తాయని తాను చేయించిన సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి తెలిపారు.
 TRSLP meeting today
సొంత సర్వేలో భారీ మెజార్టీ వస్తుందని తేలడంతో టీఆర్‌ఎస్‌ నేతలలో భారీ ఉత్సాహం నెలకొంది. అలాగే త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తటస్థంగా ఉండాలని ఈ భేటీలో  నిర్ణయించింది. ఇదిలా ఉండగా  పనితీరు మెరుగుపర్చుకోవలసిందిగా మిగిలిన ప్రజాప్రతినిధులకు సీఎం సూచించినట్టు సమాచారం.

10 రోజులకొకసారి జిల్లా ప్రతినిధులు సమావేశమవ్వాలని, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అమిత్ షా నల్లగొండ వచ్చినంత మాత్రానా.. బీజేపీకి ఒరిగేదేమీ లేదని సీఎం అన్నట్టు సమాచారం.

- Advertisement -