7న టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం

103
trslp

ఈ నెల 7న సాయంత్రం 5 గంటల నుంచి తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతుంది. దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి మరణానికి టిఆర్ఎస్ ఎల్పీ సంతాపం తెలుపుతుంది. ఆయనకు నివాళి అర్పిస్తుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు.