పెద్ద మనసుతో పసిపాప ప్రాణాలు కాపాడిన కేటీఆర్

269
ktr small chaild
- Advertisement -

ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ వెంటనే స్పందించే నేత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన దృష్టికి వచ్చిన సమస్యను అంతే వేగంగా పరిష్కిరిస్తారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందిస్తుంటారు. గతంలో చాలా మందికి ఆయన సాయం చేసిన సంగతి తెలిసిందే. సామాజిక సమస్యలే కాదు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే నిరుపేదలకు సైతం కేటీఆర్ ఆపన్నహస్తం అందిస్తారు.

తాజాగా ఓ చిన్నపాపకు సాయం చేసి తన పెద్ద మనసు చాటు కున్నారు కేటీఆర్. తాజాగా నరేష్ అనే వ్యక్తి తన కుమార్తెకు గుండెలో రంధ్రం ఉందని చెప్పారని, చికత్సకు రూ. 5లక్షల వరకు ఖర్చువుందని..అర్జెంటుగా డబ్బులు కట్టి ఆపరేషన్ చేయించాలని లేదంటే పాప ప్రాణాలకు ప్రమాదం ఉందని ట్వీట్ చేశారు.

ఓ వైపు పోలింగ్ బిజీలో ఉన్న కేటీఆర్.. నరేష్ ట్వీట్ చూసి కేటీఆర్ వెంటనే స్పందించారు. తప్పకుండా ఆదుకుంటాం బ్రదర్, దయచేసి ఆఫీసుకు రండి అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/KTRTRS/status/1116312594443169793

- Advertisement -