క్రికెట్ ఫ్యాన్స్ కి ఎప్పటికి గుర్తుంటావ్ః కేటీఆర్

512
Ambati Raydu Ktr
- Advertisement -

 తెలుగు ఆటగాడు అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు విడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక అంబటి రిటైర్మెంట్ పై స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాయుడు అసలైన చాంపియన్‌ అని, సెలెక్టర్లు పట్టించుకోకపోయినా క్రికెట్‌ ఫ్యాన్స్‌ రాయుడును ఎప్పటికీ మరచిపోరని ఆయన అన్నారు. రాయుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ బాగుండాలని ఆయన ఆకాంక్షించారు.

వరల్డ్ కప్ లో ఆడాలనే తన కళ నెరవేరక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అంబటి నిన్న సాయంత్రం రాజీనామా లేఖను బీసీసీఐకి పంపించాడు. ఇక రాయుడు తీసుకున్న నిర్ణయంపై పలువురు ప్రశంసిస్తుండగా..కొంత మంది తొందరపడి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

వరల్డ్ కప్ లో విజయ్ శంకర్ గాయం కారణంగా దూరమవ్వడంతో అతని ప్లేస్ లో అంబటి రాయుడికి తీసుకుంటారని భావించారు. కానీ సెలక్టర్లు రాయుడిని కాదని మయాంక్ అగర్వాల్ ను తీసుకున్నారు. సెలక్టర్ల తప్పుడు నిర్ణయాల వల్ల అంబటి రాయుడు క్రికెట్ కు దూరమవ్వాల్సి వచ్చిందన్నారు సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్.

- Advertisement -